పెడన నియోజకవర్గం మడక గ్రామంలో మద్యం మత్తులో ఇరువురు వ్యక్తులు మధ్య ఏర్పడిన వివాదం ఒకరి మృతికి కారణంగా మారింది. ఈ ఘటన సోమవారం ఉదయం జరిగింది. ఘర్షణలో మడక గ్రామానికి చెందిన ఆశీర్వాదం అనే వ్యక్తి మృతి చెందాడు. ఈ విషయం తెలుసుకున్న గ్రామపెద్దలు బయటికి రాకుండా రాజీ ఒప్పందానికి మంతనాలు చేస్తున్నారు. ఈ విషయం పొక్కటంతో గ్రామంలో అలజడి రేగింది.