కృష్ణాజిల్లా పెడన పట్టణంలో జరుగుతున్న పైడమ్మ మహోత్సవాలు ఆదివారానికి 9వ రోజు కావడంతో ఆలయ ప్రాంగణం సిడిబళ్లతో రద్దీగా మారింది. 9వ రోజు ఎంతో ప్రసిద్ధి కావడంతో రాష్ట్ర నలుమూలల నుంచి భక్తులు అమ్మవారి దర్శనానికి భారీ సంఖ్యలో పాల్గొంటారు. ఆలయం వద్ద భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా ఆలయ కార్యనిర్వహణ అధికారి తిక్కిశెట్టి వీవీ మోహనరావు మున్సిపల్, పోలీస్, ఆరోగ్య శాఖ అధికారులతో ఏర్పాట్లు చేశారు.