ఈనెల 24న సీఎం చంద్రబాబు నాయుడు కంకిపాడు రానున్నారు. స్థానిక అయాన కన్వెన్షన్ లో రెండు రోజులపాటు జరిగే క్రెడాయ్ సమావేశానికి హాజరు కానున్నారు. ఈనెల 25న కేంద్రమంత్రి పెమ్మసాని చంద్రశేఖర్ కూడా ఈ సమావేశంలో హాజరుకానున్నారు. అలాగే ఈనెల 28వ తేదీన ఇక్కడ జరిగే టిడిపి నేత గొట్టిపాటి రామకృష్ణ తనయురాలు వివాహ వేడుకకు మరొకసారి సీఎం చంద్రబాబు నాయుడు హాజరుకానున్నారు.