తిరువూరులో మంచినీటి కష్టాలు

80చూసినవారు
తిరువూరులో మంచినీటి కష్టాలు
వర్షాకాలంలో సైతం తిరువూరు పట్టణ ప్రజలకు తాగునీటి కష్టాలు తప్పట్లేదు. గత నెల రోజులుగా చాలా ప్రాంతాలకు రక్షితనీటి సరఫరా నిలిచిపోయింది. కట్టెలేరు పంపింగ్ స్కీమ్ వద్ద ప్రధాన పైపులైన్ పగిలిపోవడంతో కుళాయిల ద్వారా నీరందించలేకపోతున్నామని పంచాయతీ చెబుతోంది. వర్షాల కారణంగా పైపులైన్ల పునరుద్ధరణ పనులు చేయలేకపోయామని చెబుతున్న అధికారులు ఇప్పుడు ఎందుకు పనులు చేపట్టలేక పోయారని ప్రజలు ప్రశ్నిస్తున్నారు.

సంబంధిత పోస్ట్