తిరువూరులో సబ్ ఇన్ స్పెక్టర్ సెక్టార్ 1ఎస్ సత్యనారాయణ, సిబ్బందితో కలిసి వినాయక గుడి సెంటర్ లో వాహనాల తనిఖీలు చేపట్టారు. హెల్మెట్ ధరణ, ట్రాఫిక్ నిబంధనలపై వాహనదారులకు సోమవారం అవగాహన కల్పించారు. ట్రిపుల్ రైడింగ్, మైనర్ డ్రైవింగ్, మద్యం సేవించి వాహనాలు నడిపే వారికి డ్రంక్ అండ్ డ్రైవ్ పరీక్షలు చేసి చట్ట ప్రకారం చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.