ఎన్టీఆర్ జిల్లా విజయవాడ ఇంద్రకీలాద్రి కొండపై కొలువుతీరిన అమ్మవారికి పొందూరు(మ), శ్రీకాకులంకు చెందిన యతీరాజుల రాధా కృష్ణ శ్రీ అమ్మవారి దేవస్థానం నందు జరుగు అన్నదానం నిమిత్తం పేరున రూ. 1, 00, 116/-లును ఆలయ అధికారులను కలిసి ఆదివారం విరాళముగా అందజేశారు. ఈ సందర్బంగా ఆలయ అధికారులు దాత కుటుంబానికి అమ్మవారి దర్శనం కల్పించి, వీరికి వేదార్వచనం చేయించగా ఆలయ అధికారులు అమ్మవారి శేషవస్త్రం, చిత్రపటం అందజేశారు.