విజయవాడలో ప్రతిరోజు హెల్మెట్లపై అవగాహన కార్యక్రమాన్ని నిర్వహించారు. వెస్ట్ జోన్ ఏసిపి దుర్గారావు సోమవారం సాయంత్రం భవానిపురం పోలీసు స్టేషన్ పరిధి వాటర్ వర్క్స్ దగ్గర నెంబర్ ప్లేట్లు లేని వాహనాలను క్షుణ్ణంగా పరిశీలిస్తూ హెల్మెట్ లేని వారికి చలనాలు విధిస్తూ హెల్మెట్లపై అవగాహన కల్పించారు. భవానిపురం స్టేషన్ ఎస్ఐలు ఆనంద్ కుమార్, రవితేజ, అనూష, మరియు వారి సిబ్బందితో కలిసి చలానాలు విధించారు.