మైలవరం: మాట ప్రకారమే సంక్రాంతి నాటికి సీసీ రోడ్లు పూర్తి

82చూసినవారు
ఇచ్చిన మాట ప్రకారమే సంక్రాంతికి సిమెంట్ రహదారులు నిర్మాణాలను పూర్తి చేస్తున్నట్లు మైలవరం ఎమ్మెల్యే వసంత వెంకట కృష్ణ ప్రసాద్ పేర్కొన్నారు. మంగళవారం జి. కొండూరు మండలం గంగినేనిపాలెం గ్రామంలో పల్లెపండుగ కార్యక్రమంలో భాగంగా రూ. 23 లక్షల ఎన్ఆర్ఈజిఎస్ నిధులతో 480 మీటర్ల పొడవునా నిర్మించిన సిమెంట్ రహదారులను, గోకులం షెడ్ ను విజయవాడ పార్లమెంట్ సభ్యులు కేశినేని శివనాథ్(చిన్ని)తో కలిసి ఎమ్మెల్యే ప్రారంభించారు.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్