ఎన్టీఆర్ జిల్లా విజయవాడ ఇంద్రకీలాద్రి కొండపై దసరా ఉత్సవాలు మూడో రోజుకి చేరుకున్నాయి. శనివారం విజయవాడ ఎంపీ కేశినేని చిన్ని అమ్మవారిని దర్శించుకున్నారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ సామాన్య భక్తులకు సత్వర దర్శనం చేసుకునేందుకు ఇబ్బంది కలగకుండా ఉండేందుకే ఏర్పాట్లు చేస్తున్నామని అన్నారు. వివిధ రంగాల ప్రముఖులు అమ్మవారిని దర్శించుకునేందుకు ప్రత్యేకమైన యాప్ ను కూడా రూపొందించామన్నారు.