జెండా మోసే కార్యకర్తలకు మొదటి ప్రాధాన్యత ఇచ్చే పార్టీ టీడీపీ అని నియోజకవర్గ టీడీపీ అబ్జర్వర్ కనపర్తి శ్రీనివాసరావు అన్నారు. శనివారం అవనిగడ్డ పంచాయతీ పరిధిలోని రెండో వార్డులో టీడీపీ సభ్యత్వ నమోదు కార్యక్రమానికి శ్రీనివాసరావు ముఖ్యఅతిథిగా విచ్చేసి కార్యకర్తలతో కలిసి భాగస్వాములు అయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ టీడీపీ నాయకులు, కార్యకర్తలు, సానుభూతిపరులు ప్రతి ఒక్కరూ టీడీపీ సభ్యత్వం తీసుకోవాలన్నారు.