మోపిదేవి ప్రధాన సెంటర్లో వీధి దీపాలు వెలకక అంధకారంలోనే మగ్గుతున్నాయని స్థానికులు వాపోయారు. అసలే దోమలతో సతమతమవుతుంటే, మరోపక్క కుక్కలు, విష సర్పాలు రోడ్లపై సంచరిస్తున్నాయని ఆందోళన వ్యక్తం చేశారు. నిత్యం ప్రజలు భక్తులతో రద్దీగా ఉండే మోపిదేవి ప్రధాన సెంటర్లో వీధి దీపాలు వేసేవారు కరువయ్యారని ప్రజలు ఆరోపించారు. అధికారులు స్పందించి వీధి దీపాలు వెలిగేలా చూడాలని వారు కోరుతున్నారు.