విరాళాలతో పంట కాలువ పూడిక తీయించుకున్న రైతులు

69చూసినవారు
విరాళాలతో పంట కాలువ పూడిక తీయించుకున్న రైతులు
విరాళాలతో రైతులు పంట కాలువ పూడిక తీయించుకున్న ఘటన ఆదివారం వెలుగు చూసింది. ఘంటసాల మండలం యండకుదురు గ్రామంలో భీమనది ఛానల్ పరిధిలోని పంట కాలువ చివరి భూములకు సాగునీరు లేక రైతులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు.
ప్రజా ప్రతినిధులు, అధికారులకు ఎన్నిసార్లు మొరపెట్టుకున్న, సమస్యలు వివరించిన పట్టించుకోకపోవడంతో రైతులందరూ విరాళాలు సేకరించి పంట కాలువ పూడిక తీయించుకున్నారు.

సంబంధిత పోస్ట్