కృష్ణా జిల్లా అవనిగడ్డ నియోజకవర్గం ఘంటసాల మండల జనసేన పార్టీ అధ్యక్షునిపై శనివారం రాత్రి దాడి జరిగింది. కొడాలి గ్రామానికి చెందిన మండల అధ్యక్షుడు కోన రాజశేఖర్ పై కొందరు వ్యక్తులు యువకులు దాడి చేయడంతో గాయాల పాలయ్యారు. స్థానికులు హుటాహుటిన చల్లపల్లి ప్రభుత్వాసుపత్రికి ఆయనను తరలించారు. ఈ విషయంపై స్టేషన్ లో కేసు నమోదు చేశారు. జనసేన నాయకులు పలువురు ఆయనను పరామర్శించారు.