ఘంటసాలలోని వెలుగు కార్యాలయంలో తహసీల్దార్ బి. విజయప్రసాద్ అధ్యక్షతన రైతు సేవా కేంద్రాల ద్వారా ధాన్యం కొనుగోళ్లపై గ్రామ స్థాయి కమిటీ సభ్యులకు సమావేశం గురువారం నిర్వహించారు. ఈ సందర్భంగా తహసీల్దార్ మాట్లాడుతూ రైతులకు ఎటువంటి ఇబ్బందులు లేకుండా సజావుగా ధాన్యం సేకరణ చేయటానికి గ్రామస్థాయి, మండల స్థాయి కమిటీలను వేయటం జరిగిందని తెలిపారు. ధాన్యం సేకరణ ఏమైనా సమస్యలు ఉన్న యెడల కమిటీ దృష్టికి తీసుకురావచ్చునన్నారు