కోడూరు ప్రధాన కూడలిలో ఉన్న సీసీ కెమెరాలు పునరుద్ధరించాలని, స్టేషన్ పరిధిలో పెండింగ్ కేసులు లేకుండా దర్యాప్తు చేపట్టాలని జిల్లా ఎస్పీ ఆర్. గంగాధర్ రావు తెలిపారు. శుక్రవారం కోడూరు పోలీస్ స్టేషన్ ను జిల్లా ఎస్పీ ఆకస్మికంగా తనిఖీ చేశారు. వివిధ కేసుల్లో సీజ్ చేసిన వాహనాలను, స్టేషన్ రికార్డులను ఎస్పీ పరిశీలించి సంతృప్తిని వ్యక్తం చేశారు. మహిళా రక్షణపై పోలీసు వారు ప్రత్యేక దృష్టి సారించాలని సూచించారు.