కోడూరులో నరసింహపురం, కోడూరు - అవనిగడ్డ ప్రధాన రహదారుల ప్రక్కన డంపింగ్ వ్యర్ధాలు చెత్త వేస్తే చర్యలు తప్పవని కోడూరు గ్రామపంచాయతీ కార్యదర్శి బండే శేషగిరిరావు అన్నారు. ఆదివారం రహదారి ప్రక్కన వేసిన డంపింగ్ వ్యర్ధాలను జెసిపి సహాయంతో తొలగించారు. వ్యర్ధాలను పంచాయతీ వారి చెత్త బండిలో వేయాలని కోరారు. పాత గృహాలను కూల్చినవారు కూడా సెప్టిక్ ట్యాంక్ వ్యర్ధాలను కోడూరు డంపింగ్ యార్డ్ లోకి తరలించాలని కోరారు.