రాజకీయ లబ్ది పొందాలని చూడడం దారుణం: మాజీ ఎమ్మెల్యే

85చూసినవారు
తిరుపతి వెంకటేశ్వర స్వామి లడ్డు అపవిత్రతపై రాజకీయ లబ్ధి పొందాలని చూడడం దుర్మార్గమని మాజీ ఎమ్మెల్యే సింహాద్రి రమేష్ బాబు పేర్కొన్నారు. ఆదివారం అవనిగడ్డలోని వైఎస్ఆర్సిపి కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడారు. భక్తుల మనోభావాలు దెబ్బతీసేలా అపవిత్రతకు పాల్పడిన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని తెలిపారు. కూటమి ప్రభుత్వం అధికారంలో ఉంది కాబట్టి తక్షణమే చర్యలు చేపట్టాలని డిమాండ్ చేశారు.

సంబంధిత పోస్ట్