నవంబరు 5న తేదీన జరిగే నాగుల చవితి వేడుకలను అన్ని శాఖల సహకారంతో విజయవంతం చేస్తామని ఆలయ డిప్యూటీ కమిషనర్ దాసరి శ్రీరామ వరప్రసాదరావు అన్నారు. మోపిదేవిలోని శ్రీవల్లి దేవసేన సమేత శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారి దేవస్థానంలో శుక్రవారం నాగుల చవితి సమన్వయ కమిటీ సమావేశాన్ని ఆలయ ప్రాంగణంలో నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ నాగులచవితి వేడుకలకు 40 వేల మంది వరకు భక్తులు వస్తారని అంచనా ఉందన్నారు.