కోడూరు గ్రామంలో కొలిచిన వారికి కొంగుబంగారమై విరాజిల్లుతున్న శ్రీ గంగానమ్మ అమ్మవారికి ఆషాడ మాస సందర్భంగా ఇస్మాయిల్ బేగ్ పేట భక్తులు గురువారం ఆషాడ మాస సారే సమర్పించారు. ఇస్మాయిల్ బేగ్ పేట రామాలయం వద్ద నుంచి మేళతాళాలల మధ్య మురళీ కోలాటం చేస్తూ మహిళలు, వివిధ రకాల పువ్వులు, చీర , గాజులు, పసుపు, కుంకుమలు, తీసుకువచ్చి అమ్మవారికి సమర్పించారు. ఈ సందర్భంగా అర్చకులు శ్రీనివాస్ శర్మ పూజలు నిర్వహించారు.