ఇటీవల వచ్చిన వరదల కారణంగా పంటలు దెబ్బతిని నష్టపోయిన రైతులకు పరిహారం అందేలా చూడాలని అవనిగడ్డ ఎమ్మెల్యే మండలి బుద్ధప్రసాద్ కు శ్రీకాకుళం సర్పంచ్ రవిప్రసాద్ వినతిపత్రం అందజేశారు. శనివారం ఘంటసాల వచ్చిన ఎమ్మెల్యేను కలిసి రైతుల బాధలు తెలియజేశారు. వరదల కారణంగా పంట పొలాల్లోకి ఇసుక మేటలు వేయడంతో సాగుకు కష్టంగా ఉందని తెలిపారు. ఈ విషయమై అధికారులతో మాట్లాడి మేటలు తొలగించేందుకు చర్యలు చేపట్టాలని అన్నారు.