రాష్ట్ర దేవాదాయ శాఖ ఆదేశాల మేరకు మోపిదేవి లోని శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి దేవాలయంలో శనివారం ఉదయం శాంతి కౌము నిర్వహించారు. ఆలయ వేద పండితులు వేదమంత్రాల నడుమ పూర్ణాహుతి గావించి హోమ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ఆలయ అసిస్టెంట్ కమిషనర్ మాట్లాడుతూ, తిరుపతిలోని శ్రీవారి లడ్డు విషయంలో జరిగిన అపవిత్రత తొలగిపోవాలని దేవాదాయశాఖ ఆదేశాల మేరకు శాంతి హోమ కార్యక్రమాన్ని నిర్మించినట్లు తెలిపారు.