రేషన్ పంపిణీ విధానంలో డీలర్లు దళారుల దోపిడిని అరికట్టాలని కోరుతూ నాగాయలంక మండలం వక్కపట్లవారిపాలెం గ్రామ సర్పంచ్ అంబటి శ్యామ్ ప్రసాద్ మంగళవారం స్థానిక తహశీల్దార్ హరినాధ్ బాబుకు వినతిపత్రం అందజేశారు. మండలంలోని 22 గ్రామ పంచాయతీల పరిధిలో 36 రేషన్ షాపులు ఉన్నాయని, 10 రేషన్ పంపిణీ వ్యానుల యజమానుల ఆధ్వర్యంలో లబ్దిదారులను డబ్బుకు ప్రలోభపెట్టి దళారులు బియ్యం బయటకు విక్రయిస్తున్నారన్నారు.