కోడూరు మండలంలోని నాయుడుపేట గ్రామస్తులు శుక్రవారం రాత్రి కోడూరు సబ్ స్టేషన్ వద్ద ఆందోళనకు దిగారు. పది రోజుల నుంచి రాత్రి వేళలో గ్రామంలో విద్యుత్ కోత విధిస్తున్నారని గ్రామస్తులు వాపోతున్నారు. సమస్యను చెప్పుకునేందుకు సబ్ స్టేషన్ వద్దకు వస్తే అధికారులు ఇష్టానుసారంగా మాట్లాడుతున్నారే గాని సమస్యను మాత్రం పరిస్థితి ఉండడం లేదని గ్రామస్తులు మండిపడ్డారు. పోలీసులు వచ్చి నచ్చజెప్పాక వారు వెనుతిరిగారు.