సురక్షిత తాగునీరు అందించడంలో వైసిపి విఫలం

79చూసినవారు
సురక్షిత తాగునీరు అందించడంలో వైసిపి విఫలం
ప్రజలకు సురక్షిత త్రాగునీరు అందించటంలో గత వైసీపీ ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని అవనిగడ్డ ఎమ్మెల్యే మండలి బుద్ధప్రసాద్ అన్నారు. సోమవారం నాగాయలంక మండలం కమ్మనమోల గ్రామంలో ఉన్న 14 గ్రామాల త్రాగునీటి పథకాన్ని బుద్ధప్రసాద్, నియోజకవర్గ యువనాయకులు మండలి వెంకట్రామ్, టీడీపీ, జనసేన నాయకులతో కలిసి పరిశీలించారు. ఆర్. డబ్ల్యూ. ఎస్ శాఖ డీఈ పీ. సత్యనారాయణ, ఏఈ కే. కిషోర్ లతో, గ్రామస్థులతో సమస్యపై చర్చించారు.

సంబంధిత పోస్ట్