అవనిగడ్డ: ఆర్. అండ్. బీ రోడ్ల మరమ్మత్తులకు నిధులు మంజూరు
అవనిగడ్డ నియోజకవర్గంలో ఆర్. అండ్. బీ రోడ్ల మరమ్మత్తులకు రూ. కోటీ 80లక్షలు మంజూరైనట్లు అవనిగడ్డలో ఎమ్మెల్యే మండలి బుద్ధప్రసాద్ శుక్రవారం ఒక ప్రకటనలో తెలిపారు. చల్లపల్లి - నడకుదురు రోడ్డు, భావదేవరపల్లి - సంగమేశ్వరం రోడ్డు, నాగాయలంక - నాలి రోడ్డు, రామానగరం నడకుదురు రోడ్డు, గుడివాడ-చల్లపల్లి - కొత్తపాలెం రోడ్డు, టీ. కొత్తపాలెం - గుల్లలమోద రోడ్ల మరమ్మతులకు నిధులు మంజూరైనట్లు వివరించారు.