మోపిదేవి: నూరు శాతం సీసీ రోడ్ల నిర్మాణానికి ప్రభుత్వం కృషి

71చూసినవారు
గత ఐదేళ్లలో అభివృద్ధికి నోచుకోని గ్రామాల్లో కూటమి ప్రభుత్వం నూరు శాతం సీసీ రోడ్ల నిర్మాణానికి కృషి చేస్తోందని ఎమ్మెల్యే తనయుడు మండలి వెంకట్రామ్ తెలిపారు. ఆదివారం మోపిదేవి మండలం మెరకనపల్లి గ్రామంలో పల్లె పండుగ - పంచాయతీ వారోత్సవాలు కార్యక్రమం జరిగింది. ఈ సందర్భంగా గ్రామంలో రూ. 18 లక్షల 20వేలతో నాలుగు సీసీ రోడ్ల నిర్మాణానికి వెంకట్రామ్ భూమిపూజ చేశారు. నాయకులు, గ్రామస్తులు పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్