మోపిదేవి: పర్మిట్ రూములకు అనుమతి లేదు: ఎక్సైజ్ సీఐ

66చూసినవారు
వైన్ షాపుల వద్ద పర్మిట్ రూములకు అనుమతి లేదని అవనిగడ్డ ఎక్సైజ్ సీఐ గిరిజా సత్యకుమారి స్పష్టం చేశారు. మంగళవారం మోపిదేవిలోని వైన్ షాపులను ఆమె పరిశీలించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ. మద్యం షాపుల సమీపంలో మద్యం సేవించడం చట్ట రీత్యా నేరమన్నారు. ఎమ్మార్పీ రేట్లకే విక్రయాలు జరగాలని నిర్వాహకులకు తెలిపారు. షాపులకు సంబంధించి హద్దులను పరిశీలించి నమోదు చేసుకున్నారు. ఆమె వెంట ఎక్సైజ్ సిబ్బంది ఉన్నారు.

సంబంధిత పోస్ట్