అవనిగడ్డ: ఇళ్ల స్థలాలు కేటాయించాలని వినతి
అవనిగడ్డ మండల పరిధిలోని పాత ఎడ్లంక గ్రామస్తులకు అవనిగడ్డలో ఇళ్ల స్థలాలు కేటాయించాలని గ్రామస్తులు తహసీల్దార్ నాగమల్లేశ్వరరావుకు సోమవారం వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా గ్రామస్తులు మాట్లాడుతూ కృష్ణా నదికి వరదలు వచ్చినప్పుడు తీవ్ర ఇబ్బందులు పడుతున్నామని తెలిపారు. గ్రామం కృష్ణానది పాయలో ఉండడంతో మా ఇబ్బందులను గుర్తించి అవనిగడ్డలో నివేశనా స్థలాలు కేటాయించి గృహాలు నిర్మించుకునేలా చర్యలు చేపట్టాలన్నారు