రాష్ట్రంలోనే ప్రముఖ దేవాలయంగా విరాజిల్లుతున్న శ్రీ వల్లి దేవసేన సమేత శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారిని దర్శించుకునేందుకు భక్తులు పోటెత్తారు. ఆదివారం సెలవు దినం కావడంతో రాష్ట్రం నలుమూలల నుంచి అధిక సంఖ్యలో వచ్చిన భక్తులు క్యూ లైన్ లలో స్వామివారి దర్శనం కోసం ఎదురుచూశారు. ఆలయ కార్య నిర్వహణ అధికారి దాసరి శ్రీరామ వర ప్రసాదరావు భక్తులకు అవసరమైన ఏర్పాట్లను పర్యవేక్షించారు.