గన్నవరం గ్రామానికి చెందిన ప్రముఖ వ్యాయామ ఉపాధ్యాయులు జల సూత్రం వెంకటరావుని జిల్లా క్రీడా ప్రతిభ అవార్డు వరించింది. ఈ సందర్భంగా గురువారం డీఈవో కార్యాలయంలో రాష్ట్ర వ్యాయామ విద్య సంచాలకులు, స్కూల్ గేమ్స్ ఫెడరేషన్ రాష్ట్ర కార్యదర్శి భానుమూర్తి రాజు చేతుల మీదుగా అవార్డును అందుకున్నారు. వెంకటరావును గన్నవరం వ్యాయామ ఉపాధ్యాయ మిత్రమండలి, క్రీడాకారులు క్రీడా ప్రముఖులు ఎంతగానో అభినందించారు.