గన్నవరం సామాజిక ఆరోగ్య కేంద్రాన్ని ఆకస్మికంగా తనగన్నవరం సామాజిక ఆరోగ్య కేంద్రంను వంద పడకల ఆస్పత్రిగా అభివృద్ధి చేసేలా చర్యలు తీసుకుంటున్నామని ప్రభుత్వ విప్, గన్నవరం ఎమ్మెల్యే యార్లగడ్డ వెంకట్రావ్ పేర్కొన్నారు. సోమవారం ఆయన ఆసుపత్రిని ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఆసుపత్రిలో అందిస్తున్న సేవల పై ఆరా తీశారు. రోగులతో మాట్లాడి ఆసుపత్రిలో అందుతున్న వైద్యం, సిబ్బంది తీరు గురించి తెలుసుకున్నారు.