హిందూ దేవాలయాలకు స్వయం ప్రత్తిపత్తి, దేవాలయాల సంరక్షణ డిమాండ్‌తో జనవరి 5న విశ్వహిందూ పరిషత్ ఆధ్వర్యంలో నిర్వహించనున్న హైందవ శంఖారావం సభను జయప్రదం చేయాలని గన్నవరం ఎమ్మెల్యే యార్లగడ్డ వెంకట్రావ్ పిలుపునిచ్చారు. కేసరపల్లిలో హైందవ శంఖారావం సభ ఏర్పాట్లను గురువారం పరిశీలించారు. ఈ సందర్భంగా ఆదోని ఎమ్మెల్యే పార్థసారధిని అభినందించారు. గత 15 రోజులుగా పార్థసారధి ఇక్కడే ఉండి ఏర్పాట్లు బ్రహ్మాండంగా చేసారన్నారు.