కంకిపాడులో శనివారం మిని వ్యాన్ను ఓ కారు ఢీకొన్న ఘటనలో ముగ్గురు మరణించిన విషయం తెలిసిందే. ఈ ఘటనలో ఏసుబాబు అనే వ్యక్తి మరణవార్త విన్న అతని తల్లి సుధారాణి (60) కుప్పుకూలింది. తన కొడుకు మరణ వార్త తట్టుకోలేక కొన్ని గంటల వ్యవధిలోనే ఆమె కూడా మరణించడంతో విషాద ఘటన నెలకొంది. చూపరలను కంటతడి పెట్టించింది. వీరి మృతితో ఆ గ్రామంలో తీవ్ర విషాద ఛాయలు అలముకున్నాయి.