దేశ రాజధాని న్యూఢిల్లీలో జరిగిన నేషనల్ వర్క్ షాప్ కార్యక్రమానికి గన్నవరం మండలం కేసరపల్లి గ్రామ సర్పంచ్ చేబ్రోలు లక్ష్మి మౌనిక ఎంపికయ్యారు. గత నెల 30తేది న్యూ ఢిల్లీలో డాక్టర్ బి. ఆర్ అంబేద్కర్ ఇంటర్నేషనల్ సెంటర్ లో జరిగిన వర్క్ షాప్ కార్యక్రమంలో సర్పంచ్ హజరయ్యారు. కృష్ణా జిల్లా నుంచి ఎంపిక ఐనా లక్ష్మీమౌనికను బుధవారం గాంధీ జయంతి సందర్భంగా గ్రామస్తులు అభినందించడం జరిగింది.