రోడ్డు ప్రమాదంలో వ్యక్తికి తీవ్ర గాయాలు
ఘంటసాల మండల పరిధిలోని మల్లాయి చిట్టూరు గ్రామానికి వెళ్తున్న క్రమంలో రహదారి అధ్వానంగా ఉండడంతో ద్విచక్ర వాహనంపై నుంచి మంగళవారం ఓ వ్యక్తి పడిపోయాడు. ఈ ప్రమాదంలో అతని ముఖంపై గాయాలు కావడంతో అటుగా వస్తున్న వ్యక్తి చూచి అతన్ని ఘంటసాల ఆస్పత్రికి తరలించారు. రహదారిపై రాళ్లు తేలి ప్రయాణానికి ఇబ్బందికరంగా ఉందని పలువురు వాహనదారులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.