జనసేన నేత సందు పవన్ ఆధ్వర్యంలో గుడివాడ పట్టణం సత్యనారాయణపురంలోని ఆయన కార్యాలయం వద్ద ఆదివారం పేదలకు అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహించారు. ఎమ్మెల్యే వెనిగండ్ల రాము, ఏపీ ఎస్ డబ్ల్యూసి ఛైర్మన్ రావి వెంకటేశ్వరరావు అన్నదాన కార్యక్రమాన్ని ప్రారంభించారు. జనసేన జిల్లా నాయకుడు పేర్ని జగన్, కొదముల గంగాధర్ రావు, పలువురు కూటమి నేతలు, కార్యకర్తలు పాల్గొన్నారు.