గతంలో ఎన్నడూ లేని విధంగా ధాన్యం విక్రయించిన 24 గంటల్లో రైతుల ఖాతల్లో నగదు జమ చేస్తున్నామని పౌరసరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ తెలిపారు. గురువారం మంత్రి నాదెండ్ల గుడివాడ నియోజకవర్గంలో రోడ్లపై ఆరబోసిన ధాన్యపు రాసులను పరిశీలించారు. ఈ సందర్భంగా మంత్రి నాదెండ్ల మనోహర్ మాట్లాడుతూ ప్రభుత్వం ద్వారానే రైతాంగానికి కనీసం మద్దతు ధర లభిస్తుందని ఉమ్మడి జిల్లాలో ధాన్యం తరలించేలా చర్యలు తీసుకున్నామని తెలిపారు.