చట్టాలపై ప్రతి విద్యార్థి అవగాహన ఉండాలని ఎస్ఐ గౌతమ్ కుమార్ పిలుపునిచ్చారు. శనివారం గుడివాడ పోలీసు సర్కిల్ పరిధిలో శక్తి టీంగా ఇద్దరిని నియమించారు. ఈ సందర్భంగా ఎస్ఐ గౌతమ్ కుమార్ మాట్లాడుతూ సమాజంలో మహిళల పట్ల జరిగే నేరాలు జరగకుండా చేపట్టే ముందస్తు చర్యలు గురించి వివరించారు. సామాజిక మాధ్యమాల దుర్వినియోగం, సైబర్ నేరాలపై అవగాహన, రోడ్ ప్రమాదాలు, అగ్నిమాపక అంశాలపై అవగాహన కల్పించారు.