విపత్కర పరిస్థితుల్లో నష్టపోయిన ఆపన్నులకు ప్రభుత్వ పరంగానే కాకుండా, వ్యక్తిగతంగా అన్ని విధాలుగా అండగా ఉంటామని గుడివాడ ఎమ్మెల్యే వెనిగండ్ల రాము అన్నారు. గుడ్లవల్లేరు మండలం వడ్లమన్నాడు గ్రామంలో విద్యుత్ షార్ట్ సర్క్యూట్ కారణంగా జరిగిన అగ్ని ప్రమాదంలో సర్వం కోల్పోయిన నాలుగు బాధిత కుటుంభాలను ఎమ్మెల్యే వెనిగండ్ల రాము సోమవారం పరామర్శించారు. ఈ సందర్భంగా ప్రమాద కారణాలను రెవిన్యూ అధికారులు వివరించారు.