నమ్మకంతో నన్ను గెలిపించినప్రజల ప్రతి సమస్యను తీర్చే బాధ్యత నాదనీ గుడివాడ ఎమ్మెల్యే వెనిగండ్ల రాము అన్నారు. నేను వచ్చింది ప్రజలకు సేవ చేయడానికే తప్ప అధికారం అనుభవించడానికి కాదనీ ఆయన స్పష్టం చేశారు. శుక్రవారం గుడివాడ రూరల్ మండలం లింగవరం గ్రామంలో నిర్వహించిన ఇది మంచి ప్రభుత్వం కార్యక్రమంలో ఎన్డీఏ కూటమి నాయకులు, అధికారులతో కలిసి గుడివాడ ఎమ్మెల్యే వెనిగండ్ల రాము పాల్గొన్నారు.