ఆల్ ఇండియా బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనారిటీ వెల్ఫేర్ సొసైటీ జాతీయ అధ్యక్షురాలు తిరువీధుల శారద మచిలీపట్నంలో అత్యాచారానికి గురై ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న మైనర్ బాలికను ఆదివారం పరామర్శించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ బాలికపై అత్యాచారం చేసిన నిందితులపై ఫోక్సో చట్టం కింద కేసు నమోదు చేసి, ప్రభుత్వం నిందితులను కఠినంగా శిక్షించాలని కోరారు. ఇలాంటి సంఘటనలు పునరావృతం కాకుండా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలన్నారు.