పరమ పవిత్రమైన తిరుమలలో ఇంతటి ఘోర అపచారానికి పాల్పడిన నీచులపై కఠిన చర్యలు తీసుకోవాలని గుడివాడ ఎమ్మెల్యే వెనిగండ్ల రాము డిమాండ్ చేశారు. శనివారం ఆయన విలేకరులతో మాట్లాడుతూ వైసిపి ప్రభుత్వం హయాంలో తిరుమల తిరుపతి దేవస్థాన లడ్డు ప్రసాదం అపవిత్రమైందని ఆరోపించారు. వైఎస్సార్సీపీ నేతలు కమీషన్ల కోసమే లడ్డూ నాణ్యతలో రాజీపడ్డారని ఆరోపించారు.