రెండు బస్సులు ఢీకొన్న ఘటనలో ఎవరికి ఎటువంటి ప్రమాదం జరగకపోవడంతో ప్రయాణికులు ఊపిరి పీల్చుకున్న సంఘటన జగ్గయ్యపేట నియోజకవర్గంలో చోటు చేసుకుంది. మంగళవారం జాతీయ రహదారి 65పై హైదరాబాద్ నుండి విజయవాడ వైపు వెళ్తున్న 2 బస్సులు షేర్ మహమ్మద్ పేట క్రాస్ రోడ్ సమీపంలో ముందు వెళ్తున్న బస్సును వెనుక వెళ్తున్న బస్సు ఢీకొంది. ఈ ప్రమాదంలో ఎవరికి స్వల్ప గాయాలు కూడా కాకపోవటంతో ప్రయాణికులు ఊపిరిపించుకున్నారు.