వత్సవాయి మండల కేంద్రమైన వత్సవాయి లోని స్థానిక మండల ప్రజా పరిషత్ కార్యాలయంలో సిడిపిఓ గ్లోరీ ఆధ్వర్యంలో పోషన్ అభియాన్ ఇంటింటా పోషణ సంబరాలు నిర్వహించారు. ఈ సందర్భంగా మండలం ఎంపీపీ చెంబేటీ వెంకటేశ్వర్లు మాట్లాడుతూ.. అంగన్వాడీ టీచర్లు, గర్భిణీలు, బాలింతలకు నాణ్యత ప్రమాణాలతో కూడిన పౌష్టిక ఆహారాన్ని అందించాలని క్రమం తప్పకుండా చిన్నారులు, గర్భిణీ స్త్రీలు కు ప్రభుత్వం నుంచి వచ్చిన సరుకులను ఎప్పటికప్పుడు వారికి అందిస్తూ ఉండాలని అంగన్వాడి టీచర్లకు ప్రతి కుటుంబంలో ఒక తల్లి కి ఉండవలసిన ఓపిక ఉండాలని అన్నారు.
అదేవిధంగా గర్భిణీలు బాలింతలకు మండల స్థాయి సమీక్ష సమావేశాన్ని నిర్వహించాలని ఆ నిర్వహణకు అయ్యే ఖర్చును తానే స్వయంగా భరిస్తానని ఎంపీపీ పేర్కొన్నారు. రానున్న రోజుల్లో మండలం లోని ప్రతి హాస్టల్ పై అంగన్వాడి సెంటర్ల పై ప్రత్యేక శ్రద్ధ వహించి మధ్యాహ్న భోజన విషయంలో ఆకస్మాత్తుగా తనిఖీ చేయడం జరుగుతుందని అంగన్వాడి టీచర్లు, సూపర్వైజర్లు వారిపై అధికారులు చిన్నారుల పట్ల ప్రేమ ఆప్యాయతను చూపిస్తూ ప్రభుత్వం నుంచి వచ్చిన సరుకులను నాణ్యత ప్రమాణాలతో ఇవ్వాలని సమగ్ర స్థాయిలో సమతుల్యంతో అంగన్వాడీలను నిర్వహించాలని అదేవిధంగా సర్వసభ్య సమావేశంలో సిడిపివో లు పూర్తిస్థాయిలో నివేదికతో హాజరుకావాలని అలా హాజరు కాని యెడల ఉన్నతాధికారులకు సిఫార్సు చేయడం జరుగుతుందని అన్నారు. కార్యక్రమానంతరం గర్భిణీలు, బాలింతలకు బహుమతులను అందజేశారు. కార్యక్రమానంతరం అంగన్వాడీల్లో గర్భిణీలు మరియు బాలింతలకు వండి పెట్టే పలు ఆహార పదార్థాలను గర్భిణీలు మరియు బాలింతలకు అందజేశారు. ఈ కార్యక్రమంలో మండల తాసిల్దార్ యం ఉదయభాస్కర్ వైస్ ఎంపీపీ కాటేపల్లి రామలక్ష్మి ఎండిఓ పద్మ యేసుపోగు దేవమణి మరియు సర్పంచ్ భూక్యా సీతమ్మ తదితరులు పాల్గొన్నారు.