ఏలూరు జిల్లాలో కైకలూరు, చింతలపూడి, జంగారెడ్డిగూడెం తదితర ప్రాంతాలలో 114 నూతన మద్యం దుకాణాల ఏర్పాటుకి సంబంధించి మంగళవారం నాటికి 2, 712 దరఖాస్తులు వచ్చాయని ఎక్సైజ్ శాఖ అధికారులు తెలిపారు. ఈ నెల 11 వరకు మాత్రమే తుది గడువు ఉండటంతో నమోదు ప్రక్రియ ఊపందుకుందన్నారు. అలాగే సోమవారం నాటికి 1, 295 నమోదు కాగా, మంగళవారం ఒక్కరోజే 1417 దరఖాస్తులందాయని అలాగే ప్రభుత్వం గడువు పొడిగించడం జరిగిందని అన్నారు.