ఉండి ఎమ్మెల్యేపై అట్రాసిటీ నమోదు చేయాలి

65చూసినవారు
ఉండి ఎమ్మెల్యేపై అట్రాసిటీ నమోదు చేయాలి
ఏలూరుపాడులో ఏర్పాటు చేసిన అంబేడ్కర్ పోటో ఉన్న ఫ్లెక్సీని చింపడమే కాకుండా వివాదస్పద వ్యాఖ్యలు చేసిన ఉండి ఎమ్మెల్యే రఘురామకృష్ణంరాజుపై ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసు నమోదు చేయాలని మాలమహానాడు జిల్లా అధ్యక్షుడు భూపతి రవీంద్ర డిమాండ్ చేశారు. ముదినేపల్లిలో ఎస్సీ సంఘాల ఆధ్వర్యంలో సోమవారం నిరసన కార్యక్రమం నిర్వహించారు. అంబేడ్కర్ విగ్రహానికి పాలాభిషేకం చేసి, జాతీయ రహదారి పై బైఠాయించి రాస్తారోకో నిరహించారు.

సంబంధిత పోస్ట్