ముదినేపల్లిలో సనాతన ధర్మ పరిరక్షణ చైతన్యయాత్ర

61చూసినవారు
ముదినేపల్లిలో ఆదివారం సాయంత్రం సనాతన ధర్మ పరిరక్షణకు చేపట్టిన చైతన్య యాత్ర వైభవోపేతంగా సాగింది. ముదినేపల్లిలోని ఆంజనేయస్వామి ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించి, ద్విచక్రవాహనాలపై సింగరాయపాలెం వరకు ర్యాలీ నిర్వహించారు. అనంతరం పలువురు మాట్లాడుతూ సనాతన ధర్మాన్ని అందరూ కాపాడాలన్నారు. నాయకులు ప్రసాద్, బావాజీ మఠం అర్చకులు రంగనాథాచార్యులు, శేషు, సత్యనారాయణ, అర్చకులు, గ్రామస్థులు పాల్గొన్నారు.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్