ఉపాధి హామీ కూలీలకు కష్టానికి తగ్గ కూలి

51చూసినవారు
అధికారంలోనికి రాగానే ఉపాధి హామీ కూలీలకు కష్టానికి తగ్గ కూలి ఇచ్చేలా చర్యలు చేపడతానని కైకలూరు నియోజకవర్గం అసెంబ్లీ ఎన్డీఏ అభ్యర్థి డా. కామినేని శ్రీనివాస్ అన్నారు. బుధవారం కొచ్చర్ల గ్రామంలో ఉపాధి హామీ కూలీలతో కామినేని మమేకమయ్యారు. వైఎస్ఆర్సిపి ప్రభుత్వం లో సరైన కూలి ఇవ్వడం లేదని, ఎండాకాలంలో మజ్జిగ ప్యాకెట్లు కూడా ఇవ్వడం లేదని అన్నారు. అదేవిధంగా కొచ్చర్ల గ్రామంలో ఇండ్ల స్థలాలు సైతం ఇవ్వలేదన్నారు.

సంబంధిత పోస్ట్