ముదినేపల్లి మండలం ఊటుకూరు ప్రధాన రహదారికి ఇరువైపులా ఉన్న ఆక్రమణలు సర్వే చేయించి గుర్తించాలని గ్రామపంచాయతీ ఆధ్వర్యంలో తహశీల్దార్ జె. సుభానీకి బుధవారం వినతిపత్రం అందించారు. ఈ క్రమంలో సర్పంచ్ మాట్లాడుతూ మలపరాజగూడెం నుంచి ఊటుకూరు ప్రధాన ఆర్అండ్ బీ రహదారి నిర్మాణానికి నిధులు మంజూరయ్యాయని చెప్పారు. అయితే రహదారికి ఇరువైపులా ఆక్రమణలు ఉండటంతో నిర్మాణానికి ఆటంకం కలుగుతుందని అన్నారు.