వైకాపా మేనిఫెస్టోలో బీసీలకు ఒరిగిందేమీ లేదు

63చూసినవారు
వైకాపా మేనిఫెస్టోలో బీసీలకు ఒరిగిందేమీ లేదు
వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రకటించిన ఆ పార్టీ ఎన్నికల మేనిఫెస్టోలో బీసీ వర్గాలకు ఒరిగిందేమీ లేదని తెలుగుదేశం పార్టీ రాష్ట్ర బీసీ సెల్ కార్యదర్శి అండ్రాజు శ్రీనివాసరావు విమర్శించారు. మండలంలోని దుంపలకోడు దిబ్బలో శనివారం కైకలూరు నియోజకవర్గస్థాయి అగ్నికుల క్షత్రియుల సమావేశం నిర్వహించారు. నిన్నటి వరకు బీసీల జపం చేసిన జగన్ మేనిఫెస్టోలో మాత్రం బీసీలకు ఉపయోగపడే ఏ ఒక్క స్కీమ్ పెట్టలేదని మండిపోడాయరు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్